లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఇటీవల ఏడీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. దీనికి ఇటీవల ప్రీ-ఎగ్జామినేషన్ నిర్వహించబడింది. ఈ పరీక్ష ఫలితాలు ఇప్పుడు విడుదలయ్యాయి. LIC ADO పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చును. అభ్యర్థులు LIC భారతదేశ అధికారిక వెబ్‌సైట్ licindia.in సందర్శించి తమ ఫలితాలను సరిచూసుకోవచ్చు. ఏడీఓ పోస్టులకు మొదటి దశ పరీక్ష మార్చి 12న నిర్వహించగా.. ఆ ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 10) న వెల్లడయ్యాయి. అనేక దశల పరీక్షల తర్వాత అభ్యర్థులు LIC అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేయబడతారు. మొదటి దశ పరీక్ష అంటే ప్రిలిమ్స్ నిర్వహించారు. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్స్ పరీక్ష 23 ఏప్రిల్ 2023న నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. 9,394 పోస్టులకు ఎల్‌ఐసీ ఏడీఓ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ ముగిసినా ఎంపిక ప్రక్రియ ముగియదు. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహిస్తారు. మూడు రౌండ్లలో ఎంపికైన అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతుంది.
ఫలితాలను చెక్ చేయండిలా..
- ఫలితాన్ని తనిఖీ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే licindia.inకి వెళ్లండి
- ఇక్కడ హోమ్‌పేజీలో కెరీర్‌ల అనే బటన్‌పై క్లిక్ చేయండి
- ఇలా చేసిన తర్వాత, ఓపెన్ అయ్యే పేజీలో Recruitment Of Apprentice Development Officer 22-23పై క్లిక్ చేయండి
- ఇలా చేసిన తర్వాత, ఓపెన్ అయిన పేజీలో “అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు” అనే లింక్‌కి వెళ్లండి
- ఇప్పుడు మీరు దరఖాస్తు చేసిన ప్రాంతం నుండి మీ జోన్‌ని ఎంచుకోండి
- తేదుపరి మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంపై క్లిక్ చేయండి
- ఇలా చేసిన తర్వాత.. ఒక PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో ఎంచుకున్న అభ్యర్థుల జాబితా ఇవ్వబడుతుంది
- ఇక్కడ మీరు మీ పేరు లేదా రోల్ నంబర్‌ను తనిఖీ చేయవచ్చు

No comments:
Post a Comment