తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. జనవరి 4 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ పరీక్షను ఏప్రిల్ లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో దీనిని మే 13న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇటీవల వెబ్ నోట్ విడుదల చేశారు. అయితే తాజాగా టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ను కల్పించింది. మే 1 నుంచి ఈ అవకాశం ఉంటుందని వెబ్ నోట్ విడుదల చేసింది. మే 01 నుంచి మే 04 వరకు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే.. సరిచూసుకోవచ్చని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
విద్యార్హత
- సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ చేసిన వారికి పేస్కేల్ లెవల్ 10 ఆధారంగా చెల్లిస్తారు.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు లోపు ఉండాలి
ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థులను రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 450 మార్కులకు రెండు పేపర్లలో పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంటుంది. రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి 150 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించారు.
జీతం
- జీతం నెలకు రూ.56,100 నుంచి రూ. 1,82,400 మధ్య చెల్లిస్తారు
ముఖ్యమైన లింక్స్
- ఎడిట్ ఆప్షన్ సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment