తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 9 విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన వెబ్ నోట్ ను ఇటీవల తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) ఇటీవల విడుదల చేసింది. కేటగిరీల వారీగా దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించున్నారు. అయితే.. ఇందుకోసం అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఓటీఆర్ తో అభ్యర్థులు తమ అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఓటీఆర్ (TRE-RB OTR) ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులకే వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment