నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ శుభవార్త చెప్పింది. టెన్ట్ అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 2 స్టాఫ్ కార్ డ్రైవర్ (స్టాఫ్ కార్ డ్రైవర్) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మే 10వ తేదీన ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రోహ్తక్ జిల్లాలో 1, హిసార్ జిల్లాలో 1 ఖాళీ ఉంది. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం వివరాలు. ఇండియన్ పోస్ట్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి టెన్త్ పాసై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900-రూ.63,200 వరకు చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 10 మే 2023 నాటికి గరిష్టంగా 56 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎలా దరఖాస్తు చేయాలి? అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో ఈ చిరునామాకు పంపాలి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్-I, O/o ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, ది మాల్, అంబాలా కంటోన్మెంట్ - 133001. అధికారిక వెబ్ సైట్: https://www.indiapost.gov.in/. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ: 17/04/2023 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: మే 10, 2023.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


No comments:
Post a Comment