తెలంగాణలో మరో రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడినాయి . మెడికల్ డిపార్ట్ మెంట్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్ డిగ్రీతో పాటు.. ఎంసీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయీంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటర్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్/ ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి.. ఎంబీబీఎస్/బీడీఎస్, ఫార్మసీలో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఏప్రిల్ 13, 2023వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ భవనం, ESI హాస్పిటల్ సనత్‌నగర్ నాచారం, హైదరాబాద్- 500076 అడ్రస్ కు దరఖాస్తులు పంపించాలి. వివరాలకు https://sangareddy.telangana.gov.in/ ను సందర్శించవచ్చు. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.31,040 నుంచి రూ.58,850 చెల్లిస్తారు అని నోటిఫికేషన్ లో తెలిపారు. వీటితో పాటు ఖమ్మం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఆధ్వర్యంలోని హెల్త్ వెల్‌నెస్ సెంటర్లలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్ లో సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ పూర్తి చేసి ఉండాలి. లేదంటే.. ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. సంబంధిత పనిలో నాలుగేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుని యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. రూ.35,000లు చెల్లిస్తారు. దరఖాస్తులు సమర్పించాల్సి చిరునామా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, పిన్ కోడ్ 5007001. వివరాలకు https://khammam.telangana.gov.in/ ను సందర్శించవచ్చు.

No comments:
Post a Comment