తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ ఈవెంట్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రెండు దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30న మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు 28వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ (https://www.tslprb.in/) నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే support@tslprb.in కు మెయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.

No comments:
Post a Comment