కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూపీఎస్సీ(UPSC) కంబైన్డ్ మెడిక్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ .. మే 9న సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ అదికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దీని కోసం అభ్యర్థులు https://upsconline.nic.in/ ను సందర్శించండి. UPSC CMS పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు. మొత్తం 1261 ఉద్యోగాల్లో.. కేటగిరీ 1లో మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 584 పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా.. కేటగిరి-2లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే) పోస్టులు 300 పోస్టులు.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఒకటి చొప్పున భర్తీ చేయనున్నారు. దీంతో పాటు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2లో 376 పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 32కు మించరాదు. అభ్యర్థులు ఎంబీబీఎస్ పాసై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తులకు అర్హులే. దరఖాస్తు రుసుము రూ.200. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తొలుత ఓటీఆర్ చేసుకొని ఆ తర్వాత దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఈ-అడ్మిట్‌కార్డులు జూన్‌లో.. ఫలితాలను ఆగస్టు 23న విడుదల చేస్తారు. రాత పరీక్ష 500 మార్కులు ఉంటుంది. ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్టులో 100 మార్కులు ఉంటుంది. దీంతో పాటు.. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆబ్జెక్టివ్ రూపంలో జరిగే ఈ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన లింక్స్
- దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment