నిరుద్యోగులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) శుభవార్త చెప్పింది. పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ స్థాయిల్లో మొత్తం 347 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ను మాత్రమే NCERT ప్రస్తుతం విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలను పూర్తి నోటిఫికేషన్ (NCERT) విడుదల చేసిన్ తర్వాతనే తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన లింక్స్
- షార్ట్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment