నిరుద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ (EPFO) కార్యాలయం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉ ద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (EPFO Job Notification) పేర్కొంది. అభ్యర్థులు ఒకటి కాన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం సైతం ఉంటుంది. కానీ వేర్వేగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) విభాగంలో 2674 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచలర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇంగ్లిష్ లో నిమిషానికి 35 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. హిందీ అయితే నిమిషానికి 30 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు వేతనం ఉంటుంది. స్టెనో గ్రాఫర్ విభాగంలో మొత్తం 185 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాసైన వారు దరఖాస్తుకు అర్హులు. వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ PwBD/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.700 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయాలి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరియు అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment