డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, విజయనగరం (THE DISTRICT CO-OPERATIVE CENTRAL BANK Ltd., VIZIANAGARAM) వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయడం జరిగింది. మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మార్చి 30వ తేదీన ప్రారంభమైంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15న ముగియనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే/జూన్ నెలలో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించనున్నట్లో నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆంగ్ల భాషపై నాలెడ్జ్ ఉండాలి. ఇంకా స్థానిక భాష అయిన తెలుగులో ప్రావీణ్యం అవసరం. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ కూడ ఉండాలి. అయితే.. ఈ ఉద్యోగాలకు కేవలం ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు జనవరి 1 నాటికి 18 - 30 సంవత్సరాల మాధ్య ఉండాలి.ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.17,900-రూ.47,920 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్పికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment