ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొరకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 2 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి రేపు లాస్ట్ డేట్. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చును. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10 అంటే ఆసక్తి ఉన్నవారు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ / ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- మార్చ్ 08, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఏప్రిల్ 10, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
జీతం
- అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్- నెలకు రూ.78,500
- ప్రాజెక్ట్ మేనేజర్- నెలకు రూ.63,000
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు జనవరి 31, 2023 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
ఖాళీల వివరాలు
- అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-1
- ప్రాజెక్ట్ మేనేజర్-1
విధ్య అర్హత
- అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్- BE/B.Tech, MBA ఇన్ ఫైనాన్స్, CA/ ICWA (CMA)
- ప్రాజెక్ట్ మేనేజర్- CA, B.Com, M.Com, MBA ఇన్ ఫైనాన్స్, CA/ ICWA (CMA)
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులందరూ దరఖాస్తు రుసుము రూ.1000 చెల్లించాలి
- దరఖాస్తు రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

No comments:
Post a Comment