తెలంగాణలోని నిరుద్యోగులకు శుభ వార్తా.. గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9 విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన వెబ్ నోట్ ను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) ఇటీవల విడుదల చేసింది. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే.. ప్రతీ ఒక్కరు ఓటీఆర్ నమోదు చేసుకోవాలని వెబ్ నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 12 నుంచి ఆ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మొత్తం 9 నోటిఫికేషన్లలో ఇటీవల జేఎల్, డీఎస్ పూర్తి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో డీఎల్ పోస్టులు 868 ఉండగా.. జేఎల్ పోస్టులు 2008 ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి 2023 ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. 2023 మే 17 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.1,37,000 వరకు జీతం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టుల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు సొసైటీల పరిధిలోని 1,276 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఎస్సీ వెల్ఫేర్ లో 346 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో 147 పోస్టులు, బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 786 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదట పూర్తి నోటిఫికేషన్ ను ఏప్రిల్ 24న విడుదల చేస్తామని ప్రకటించినా.. మూడు రోజులు ముందుగానే ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో పాటు.. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పూర్తి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేశారు. ఆయా పోస్టులకు ఈనెల 24 నుంచి వచ్చే నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ 1,276 పోస్టుల్లో 966 పోస్టులను మహిళకు కేటాయించారు. నోటిఫికేషన్ కొరకు TREIRB వెబ్‌సైట్ https://treirb.telangana.gov.in/ ను సందర్శించొచ్చు. సబ్జెక్ట్స్ వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉద్యోగ ఖాళీలు 1276
- డీఎల్ పోస్టులు 868 ఖాళీలు కలవు
- జేఎల్ పోస్టులు 2008 కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 17, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 17, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులకు ఈనెల 24 నుంచి వచ్చే నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హతలు
- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబ్ల్యూఎస్, దివ్యాంగులకు 45 శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది. దీంతో పాటు.. బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యూకేషన్ పూర్తి చేసి ఉండాలి.
వేతనం
- రూ.1,37,000 వరకు వేతనం లభిస్తుంది
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://treirb.telangana.gov.in/index.phpను ఓపెన్ చేయాలి
- హోం పేజీలో Apply Online/ One Time Registration (OTR) అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో New Registration (OTR)? అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది
- ఫస్ట్ మీ ఆధార్ వివరాలను నమోదు చేయాలి
- తర్వాత సూచించిన ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది
- తర్వాత ఓటీఆర్ నంబర్ సహాయంతో సైన్ ఇన్ అనే రెండో ప్రాసెస్ కు వెళ్లాలి
- దీనిలో మీ వివరాలను నమోదు చేసి.. సబ్ మిట్ చేయండి. చివరగా భవిష్యత్ అవసరాల కొరకు మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి
ముఖ్యమైన లింక్స్
- వన్ టైం రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |

No comments:
Post a Comment