కాశీ హిందూ యూనివర్సిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్ bhu.ac.inని సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 03. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసని తర్వాత దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ మే 06 గా నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / LLB / CA / MBBS మరియు ఇతర నిర్దేశిత అర్హతలు మరియు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పని అనుభవం కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 35/45 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం పోస్టుల వారీ షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ / రాత పరీక్ష / ఇంటరాక్షన్ / ప్రెజెంటేషన్ / స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ / ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లు వెరిఫై చేయబడతాయి. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా 03 మే 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెల్, హోల్కర్ హౌస్, BHU వారణాసి (UP)కి 06 మే 2023లోపు పంపాలి. పూర్తి వివరాలకు అభ్యర్థులు bhu.ac.in వెబ్ సైట్ లో సందర్శించొచ్చు.

No comments:
Post a Comment