దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థుల నుంచి రూ.500 పరీక్ష ఫీజు వసూలు చేసిన విషయం తెలిసినదే. అయితే దీనిలో రూ.100 పరీక్ష ఫీజు తీసుకొని.. మిగిలిన రూ.400 మీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి పోస్టులకు 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 పరీక్ష ఫీజునున వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.250 వసూలు చేశారు. అయితే ఆ డబ్బులను ఆర్ఆర్బీ రిఫండ్ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి పోస్టులకు 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 పరీక్ష ఫీజునున వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.250 వసూలు చేశారు. అయితే ఆ డబ్బులను ఆర్ఆర్బీ రిఫండ్ చేస్తోంది. ఈ పరీక్షకు చెల్లించిన దరఖాస్తు రుసుంను అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి రిఫండ్ చేయనున్నట్టు వెల్లడించింది. 2022 ఆగస్టు 17 నుంచి 2022 అక్టోబర్ 11 వరకు జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్టు(CBT)కు హాజరైన అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరీక్ష రాయని అభ్యర్థులకుఈ అమౌంట్ రిఫండ్ రాదని కూడా తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14న ఉదయం 10గంటల నుంచి ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతా నంబర్, IFSC కోడ్ తదితర వివరాలను మరోసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిలో ఏ బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు రిఫండ్ కావాలో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గత నాలుగేళ్ల వ్యవధిలో పలు బ్యాంకులు విలీనం కావడంతో IFSC కోడ్‌లు మారాయని.. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరోసారి అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. అభ్యర్థులు తప్పుడు వివరాలు సమర్పించడం వల్ల రిఫండ్ చేసిన మొత్తం వారి ఖాతాల్లో జమకాకపోతే అందుకు ఆర్‌ఆర్‌బీ ఎలాంటి బాధ్యత వహించవని స్పష్టంచేసింది. దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థుల నుంచి రూ.500 పరీక్ష ఫీజు వసూలు చేశారు. దీనిలో రూ.100 పరీక్ష ఫీజు తీసుకొని.. మిగిలిన రూ.400 మీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల సమయంలో రూ.250 చొప్పున వసూలు చేయగా.. వీరికి మాత్రం ఫుల్ అమౌంట్ రిఫండ్ కానుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డీ పరీక్ష రాసిన అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన లింక్ ను ఉపయోగించి మీ వివరాలను నమోదు చేసి.. రిఫండ్ కు దరఖాస్తు చేసుకోండి.

No comments:
Post a Comment