ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భువనేశ్వర్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక సైట్ niser.ac.inని సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 29 మే 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ యొక్క వివిధ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులలో నిర్దేశించిన మార్కులతో పాటు ఫిజిక్స్/కెమిస్ట్రీ/జువాలజీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిలో BSC డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. అంతే కాకుండా.. ఇతర నిర్దేశిత అర్హతలు మరియు పని అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు.. గరిష్ట వయస్సు 25/30/32/33/35/37/40/42 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
రాత పరీక్ష / పర్సనల్ ఇంటర్వ్యూ / ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను నియమిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.1,42,400 జీతం ఇవ్వబడుతుంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజులో కాస్త మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment