ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ కెమికల్ ప్రాసెస్ వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయీంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు పేర్కొన్న ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తును పూరించి.. అవసరమైన అన్ని పత్రాలతో పాటు చివరి తేదీకి ముందు పేర్కొన్న చిరునామాకు పంపండి. దరఖాస్తును దిగువ పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేయడానికి.. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలన్నా లేదా నోటీసు ద్వారా వివరాలను తెలుసుకోవాలన్నా అధికారిక వెబ్ సైట్ ను munitionsindia.co.in సందర్శించాలి. అర్హతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన వివరాలను ఇక్కడ నుండి తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 100
- 100 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 18, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 05, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు (ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లు ఈ తేదీకి ముందే పేర్కొన్న చిరునామాకు చేరుకోవాలని గమనించాలి. కాబట్టి సకాలంలో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు పంపవలసిన చిరునామా దానిపై స్పష్టంగా రాయబడి ఉండాలి.)
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు రుసుము లేదు
దరఖాస్తు పంపించవలసిన చిరునామా
- నిర్దేశించిన ఫార్మాట్‌లో ఫారమ్‌ను పూరించి.. ఫోటోగ్రాఫ్‌లు మొదలైన వాటితో సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లతో జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ, జిల్లా – నర్మదాపురం, మధ్యప్రదేశ్ – 461122కి పంపండి.
వేతనం
- రూ.19,900తో పాటు.. డీఏ ఇస్తారు.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment