నిరుద్యోగులకు శుభ వార్త. ఢిల్లీలోని ప్రముఖ ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) తో పాటు దేశ వ్యప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల విడుదల చేశారు. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు నార్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్ సెట్)-4 విడుదలైంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 05ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆ తేదీలోగా aiimsexams.ac.in వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 3055 ఖాళీలకు గాను ఎయిమ్స్ బీబీ నగర్ లో 150, ఎయిమ్స్ మంగళగిరిలో 117 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలు: డిప్లొమా (GNM)తో పాటు రెండేళ్ల అనుభవం/బీఎస్సీ (ఆనస్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్/బీఎస్సీ (పోస్టు స్టిఫికేట్)/పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా అభ్యర్థులు స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్సుగా రిజిస్టర్ అయి ఉండాలి. ఇతర పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులు aiimsexams.ac.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం హోం పేజీలో కనిపించే NORCET-4 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. అనంతం అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి.. ప్రింట్ తీసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ.3000, ఓబీసీ అభ్యర్థులు రూ.2400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/EWS అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఏప్రిల్ 12 నుంచి మే 5 వరకు అప్లికేషన్లు స్వీకరించబడుతాయి. మే 6 నుంచి మే 8 వరకు అప్లికేషన్ సవరణ తేదీలు. జూన్ 3న సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

No comments:
Post a Comment