Mother Tongue

Read it Mother Tongue

Saturday, 8 April 2023

శుభ వార్త.. కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC GD కానిస్టేబుల్ ఫలితాలను ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరీక్షలో SSF మరియు రైఫిల్‌మ్యాన్ (GD)లో హాజరైన అభ్యర్థులు ssc.nic.in లో తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్ష 2023 జనవరి 10 నుండి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు PET/PSTలో హాజరు కావడానికి అర్హులు అని పేరుకొన్నారు. నోటీసు ప్రకారం.. CAPFలు నిర్వహించే PET/PST కోసం ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్‌లు నోడల్ CAPF అంటే CRPF ద్వారా జారీ చేయబడతాయి. దీని కోసం అభ్యర్థులు rect.crpf.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలి. పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. ఇది 8 మే 2023 వరకు అందుబాటులో ఉండబోతుంది. SSC రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 50,187 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు అని తెలిసిన విషయమే. SSC GD పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, PET పరీక్షకు హాజరు కావడానికి అర్హులు అగును. 

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

  • ముందుగా అభ్యర్థులందరూ SSC అధికారిక సైట్‌ ssc.nic.in ను చూడవలెను.ఆ తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలో సంబంధిత లింక్‌పై క్లిక్ చేయవలెను
  • ఇప్పుడు అభ్యర్థి ముందు కొత్త PDF ఫైల్ ఓపెన్ అవబడుతుంది
  • అభ్యర్థులు ఈ ఫైల్‌లో వారి రోల్ నంబర్‌ను తనిఖీ చేసుకోవాలి
  • అభ్యర్థులు ఈ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చును
  • చివరగా అభ్యర్థులు దాని హార్డ్ కాపీని కూడా సేవ్ చేయవచ్చును


8 comments:

Job Alerts and Study Materials