నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. కావున NWDA యొక్క ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు కోసం అభ్యర్థులు ఈ నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ యొక్క అధికారిక వెబ్‌సైట్ nwda.gov.in సందర్శించవచ్చు . ఈ వెబ్‌సైట్ కాకుండా ఇతర మార్గాల ద్వారా దరఖాస్తు చేయకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడతాయి. మార్చి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయినది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 17, 2023 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 13
- జూనియర్ అకౌంటెంట్స్ - 01
- డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 3 - 06
- అప్పర్ డివిజిన్ క్లర్క్ - 07
- స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2 - 09
- లోయర్ డివిజన్ క్లర్క్ - 04
మొత్తం - 40 ఖాళీలు
విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు పోస్టును బట్టి మారుతూ ఉంటాయి. ప్రతి పోస్ట్ గురించి వివరంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయడం మంచిది. ఎక్కువగా.. 12వ తరగతి ఉత్తీర్ణత నుండి సంబంధిత రంగంలో పట్టభద్రులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉన్న అభ్యర్థులు జూనియర్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణులు స్టెనోగ్రాఫర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నా అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రూ.890 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
వేతనం
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి వేతనంలో మార్పు ఉంటుంది. కొన్ని పోస్టులకు నెలకు లక్షకు పైగా వేతనం.. కొందరికి 80 వేల రూపాయల వరకు వేతనం ఉంటుంది.
ఈ పోస్టుల ఎంపిక మూడు దశల పరీక్షల తర్వాత ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ వంటివి ఈ దశల్లో ఉంటాయి. ఇది కూడా పోస్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | స్టడీ మెటీరియల్స్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
No comments:
Post a Comment