ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మరియు ట్రైనింగ్ స్కీం కింద పోస్టులను భర్తీ చేస్తారు. డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఉద్యోగ ఖాళీలు 4374
- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 212 ఖాళీలు కలవు
- ట్రైనింగ్ స్కీ్ం (స్టైపెండరీ ట్రైనీ) కింద 4,162 కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 24, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 22, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, దివ్యంగులకు కేటగిరీల అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు
- మిగిలిన కేటగిరి వారికీ పోస్టులను భట్టి రూ. 500 నుండి రూ. 100 వరకు ఉన్నాయి
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి
- పోస్టులను భట్టి వైయో పరిమితులలో తేడాలు ఉన్నాయి మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ లో చూడవచ్చు
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హతలు
- పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక ప్రక్రియ
- పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- రాత పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి, గుంటూరు , హైదరాబాద్ , కరీంనగర్ , విజయవాడ , విశాఖపట్నం
ప్రిలిమినరీ పరీక్ష
- మొత్తం 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. దీనిలో మ్యాథ్స్ లో 20, సైన్స్ లో 20, జనరల్ అవేర్ నెస్ లో 10 ప్రశ్నలను కేటాయించారు
- ప్రతీ సరైన సమాధానానికి మూడు మార్కులను కేటాయించనుండగా.. ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
- వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అడ్వాన్స్ డ్ టెస్టు ఉంటుంది
- దీని తర్వాత స్కిల్ టెస్టు ఉంటుంది
వేతనం
- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేసే పోస్టుల్లో.. టెక్నికల్ ఆఫీసర్/ సి 181 పోస్టులుసైంటిఫిక్ అసిస్టెంట్/ బి 7 పోస్టులు, టెక్నీషియన్/ బి 24 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.56,100, ఎస్‌ఏకు రూ.35,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.
- ట్రైనింగ్ స్కీం (స్టైపెండరీ ట్రైనీ) కేటగిరీ-1 1216 పోస్టులు, కేటగిరీ-2 2946 పోస్టులుఉన్నాయి. వీటికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000, కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు
- బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితరాలు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (Start from April 24)
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |

No comments:
Post a Comment