ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో ఇండియన్ రైల్వే 1,52,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను రైల్వేశాఖ ప్రారంభించింది. రానున్న 5 నెలల్లో 3 లక్షల పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేస్తుందని విశ్వసించగా.. ఈ ఖాళీ పోస్టుల్లో 1.52 పోస్టుల్లో కొత్త రిక్రూట్‌మెంట్ జరగనుంది. అనేక నివేదికల ప్రకారం.. గతంలో రైల్వే దేశంలోని అన్ని జోన్‌ల నుండి ఖాళీగా ఉన్న పోస్టుల గురించి సమాచారాన్ని కోరింది. అన్ని మండలాల్లో పదోన్నతులు, నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని.. వచ్చే 5 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టులతో సహా అన్ని రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను ఈ వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంది. రైల్వే 1.5 లక్షల ఖాళీలు 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 2023 చివరి నుండి ప్రారంభం కావచ్చు. TTE, ALP, టెక్నీషియన్, స్టేషన్ మాస్టర్, గ్రూప్ D, NTPC కోసం రైల్వే 1.5 లక్షల రిక్రూట్‌మెంట్ 2023లో మొత్తం 1,52,713 ఖాళీలు విడుదల చేయబడతాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. 7784 TTE పోస్టులు ఖాళీగా ఉండగా.. 16 జోన్ల వారీగా చూస్తే.. ఉత్తర రైల్వేలో అత్యధికంగా 1106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉత్తర మధ్య రైల్వేలో 982, తూర్పు రైల్వేలో 788, దక్షిణ మధ్య రైల్వేలో 746 ఖాళీలు ఉన్నాయి. వీటికి 10వ / 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌కు అర్హులు. దరఖాస్తు ఫీజు.. జనరల్ / OBC / EWS – రూ.500, SC / ST / మహిళలు / మాజీ సైనికులు - రూ. 250, నెట్ బ్యాంకింగ్ / డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / SBI చలాన్ / కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనిష్ట - 18 సంవత్సరాలు, గరిష్టంగా - 30 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపులో సడలింపు ఉంటుంది.

savalamchendhu@gmail.com
ReplyDeletesavalamchendhu@gmail.com
ReplyDeleteSir phc categerious jobes lavu
ReplyDelete