ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21, 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 10, 2023 వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. రేపటి నుంచి ఇంటర్ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రరీ పోస్టులకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ను కల్పించింది. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ను సందర్శించాలి.
ఎడిట్ విధానం
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫర్ ది లైబ్రేరియన్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి
- ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీ తో పాటు.. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి
- ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ పారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. అర్హతకు సంబంధించి వివరాలను సరిచూసుకోవాలి
- చివరగా అభ్యర్థి యొక్క వివరాలను సరిచూసుకొని.. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోండి. చివరకు సబ్ మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ ఎడిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment