కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రసారభారతి (Prasar Bharati), నిరుద్యోగులకు శుభ వార్త చెప్పింది. దూరదర్శన్ న్యూస్(DD News)లో వీడియోగ్రాఫర్స్‌గా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 18న సంస్థ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ జారీ అయిన 15 రోజుల్లోపు applications.prasarbharati.org వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. అంటే అప్లికేషన్ ప్రాసెస్‌కు చివరి తేదీ మే 5గా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హత, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాలు పరిశీలిద్దాం. ప్రసార భారతిలో వీడియోగ్రాఫర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి పాసై ఉండాలి. సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో డిగ్రీ/ డిప్లొమా సర్టిఫికేట్‌తో పాటు కనీసం 5 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. MOJO(మొబైల్ జర్నలిజం)లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు, షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డీడీ న్యూస్ కోసం వీడియోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. రాత పరీక్ష తేదీ వివరాలపై ప్రసారభారతి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 41 వీడియో గ్రాఫర్స్ పోస్టులను ప్రసారభారతి భర్తీ చేయనుంది. ఎంపికయ్యే అభ్యర్థులు రెండేళ్ల పాటు ఢిల్లీలో కాంట్రక్ట్ పద్దతిలో ఫుల్‌టైమ్ పనిచేయాల్సి ఉంటుంది. నెలకు జీతం రూ.40,000గా ఉంటుంది. కాగా, అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్ సమర్పించే సమయంలో ఏదైనా సమస్య ఉంటే, ఈ వివరాలను స్క్రీన్‌షాట్ తీసి hrcell4l3@gmail.com కు ఇమెయిల్ సెండ్ చేయవచ్చు. ప్రసార భారతి అనేది భారతదేశ అతిపెద్ద బ్రాండ్‌కాస్టింగ్ సంస్థ. దీన్ని పార్లమెంట్ చట్టం ద్వారా 1997 నవంబర్ 23న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దూరదర్శన్, టెలివిజన్ నెట్‌వర్క్, ఆల్ ఇండియా రేడియోలు దీని ఆధీనంలో పనిచేస్తాయి. అర్హులైన అభ్యర్థులు ప్రసారభారతి అధికారిక పోర్టల్ applications.prasarbharati.org విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత లాగిన్ అవ్వాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఫారమ్‌లో అన్ని వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.

No comments:
Post a Comment