నిరుద్యోగులు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఒక గుడ్‌న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగ ఖాళీలు 291
- ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ(DR)-జనరల్ నుంచి 222 పోస్టులు
- ఆఫీసర్ ఇన్ గ్రేడ్ B (DR) డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ నుంచి 38 పోస్టులు
- ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ (DR)- స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ నుంచి 31 పోస్టులు
ముఖ్యమైన తేదీలు
- మే 09, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 09, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి
అప్లికేషన్ ప్రాసెస్
- ముందు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ opportunities.rbi.org.in విజిట్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ‘గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్-2023’పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ముంబైకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను జనరేట్ చేస్తుంది.
- తర్వాత లాగిన్ అయి అడ్వర్టైజ్‌మెంట్ పేజీలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిలప్ చేయాలి.
- అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ప్రివ్యూ చూసుకున్న తరువాత సబ్‌మిట్ చేయండి.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment