టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నోటిఫికేషన్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. ఏడాదికి రెండు సార్లు ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుండగా.. తాజాగా జులై - 2023కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 17వ ఎడిషన్ సీటెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 27 న ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 26 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 27, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 26, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
- పరీక్ష తేదీలు జులై 2022- ఆగస్టు 2023
- 26-05-2023 ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ
ఎగ్జామ్ ప్యాట్రర్న్
- ఈ పరీక్షకు సంబంధించి మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం ఉంటుంది. రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు టీచింగ్ చేయాలనుకునే వారి కోసం ఉంటుంది. సీటెట్ స్కోర్ జీవిత కాలం వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ను 20 భాషల్లో నిర్వహించనున్నారు.
అర్హతలు
- Paper-1: 50 శాతం మార్కులతో ఇంటర్ తో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య)/ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
- Paper-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(B.Ed)/ బీఈడీ(ప్రత్యేక విద్య)/ సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్స్ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏ ఈడీ/ బీఎస్సీ ఈడీ పాసై ఉండాలి.
ఎగ్జామ్ సెంటర్లు
- తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు: అనంతపురం, ఏలూరు, గుంటూరు , కడప , కాకినాడ, కర్నూలు , నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment