Mother Tongue

Read it Mother Tongue

Saturday, 15 April 2023

టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. 9 పరీక్షల తేదీలపై కీలక నిర్ణయం..

టీఎస్పీఎస్సీలో మునెపెన్నడూ లేని విధంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. దాని దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు 450 మందిని విచారించారు. ఇక ఈ విచారణకు సంబంధించిన నివేదికను ఇటీవల హైకోర్టుకు సిట్ అధికారులు అందజేశారు. అరెస్టులు, కస్టడీ ఆ తరువాత జరిగిన పరిణామాలన్నింటిని కూడా సిట్ ఆ నివేదికలో పేర్కొంది. అయితే.. ఈ మధ్యలో టీఎస్పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలు అన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. మార్చి 05న నిర్వహించిన పరీక్ష చివరిది కాగా.. మార్చి 12న నిర్వహించాల్సిన టీపీబీఓ(TPBO) పరీక్షను కూడా వాయిదా వేశారు. అయితే రద్దైన పరీక్షలు 4 ఉండగా.. వాటిలో మూడు పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. డీఏఓ పరీక్షకు సంబంధించి మాత్రం కొత్త తేదీలు ఖరారు కాలేదు. ఇక ఇప్పటికే చాలా వరకు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. అయితే.. మే నెలలోనే మరో మూడు నోటిఫికేషన్లు సంబంధించి పరీక్షల తేదీల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ కి మే 13న పరీక్ష నిర్వహించనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రైరియన్ పోస్టులు. ఈ రెండు కేటగిరీ పోస్టులు టెక్నికల్ అండ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయి. మే 17న వీటికి సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి పరీక్ష తేదీల్లో కూడా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ సీబీటీలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఏఈఈ పరీక్షల తేదీలను కూడా ఇటీవల టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేసింది. ఈ పరీక్షలను మే 08, మే09, మే 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట ఏప్రిల్ 25న ప్రకటించగా.. తాజాగా దీనిని మే 16 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట మే 07వ తేదీ ప్రకటించగా.. తాజాగా దీనిని మే 19న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11, 2023న నిర్వహించనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ కూడా మార్పులు చేశారు. మొదట ఏప్రిల్ 04 న నిర్వహించాల్సి ఉండగా.. దీనిని జూన్ 17కు వాయిదా వేశారు. గ్రూప్ 4 పరీక్షను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. దీనికి దాదాపు 10లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. జులై 01న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష షెడ్యూల్ లో కూడా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఇటీవల ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. తెలంగాణలో గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. గ్రౌండ్ వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 21న పరీక్ష నిర్వహించనున్నారు. గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 18, 19న పరీక్షలు నిర్వహించనున్నారు. AMVI పోస్టులకు మొదట ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించగా.. దీనిని జూన్ 26కు వాయిదా వేశారు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials