Mother Tongue

Read it Mother Tongue

Monday, 3 April 2023

రైల్వేలో 2.90 లక్షల ఉద్యోగాలు.. ఆ నెల నుంచే వరుస నోటిఫికేషన్లు..!


 రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభ వార్త  దేశవ్యాప్తంగా దాదాపు 2,98,973 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొన్నరు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 21 RRB లల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దాదాపు 3లక్షల వరకు ఉన్న ఈ ఖాళీలను డిసెంబర్ చివరి  నాటికి భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 1.5 లక్షలకు పైగా ఖాళీలు గ్రూప్ డి, గ్రూప్ సి కి సంబంధించినవని తెలిపారు. గ్రూప్ డీ లో దాదాపు లక్షకుపైగా ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సెంట్రల్ రైల్వే ఈ సంవత్సరం 2 లక్షలకు పైగా పోస్టులను నియమించుకుంటుందన్నారు. ఇందులో గ్రూప్ సీ అండ్ గ్రూప్ డీ పోస్టులు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లు మినహా ప్రతి జోన్‌లో 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. దీన్ని భట్టి సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టులు కూడా దాదాపు 10 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. గ్రూప్స్ A మరియు B పోస్టులకు త్వరలో నియామకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ UPSC ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. 2020 నుంచి రైల్వే శాఖలో గ్రూప్-ఎ, బి పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగలేదు. ఈ సారి ఈ కేటగిరీల్లో కూడా పోస్టుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పారామెడికల్‌, గ్రాడ్యుయేట్‌ ఎన్‌టీపీసీతో కలిపి లక్షా 39 వేల ఖాళీలకు సంబంధించి రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కొనసాగుతోంది. డిసెంబర్ 01, 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్లలోని 3.12 లక్షల నాన్ గెజిటెడ్ గ్రూప్-సి మరియు డి పోస్టులకు భారతీయ రైల్వే సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని జనవరిలో రైల్వే మంత్రి తెలియజేశారు. 

లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి.. దరఖాస్తు చేసారా.. చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకొండి
స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials