Mother Tongue

Read it Mother Tongue

Saturday, 1 April 2023

ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ - 2022 విజేత ఆర్జెంటినా

 మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్ - 2022 ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. 2022 డిసెంబర్ 18 న అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో మట్టికరిపించి మూడోసారి ఫ్రీఫా టైటిల్ను సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద ఫైనల్గా లియోనల్ మెస్సీ నిలిచాడు. 

22వ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు ఖతార్ రాజధాని దోహాలో 2022 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఘనంగా జరిగాయి.  2002లో జపాన్-దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో "ఫిఫా' ప్రపంచ కప్ జరగడం ఇది రెండోసారి కాగా, ఒక మధ్యప్రాచ్య దేశం ఈ క్రీడలకు వేదిక కావడం ఇదే మొదటిసారి. మొత్తం 32 జట్లు ఈ మెగా టోర్నీలో పోటీపడ్డాయి. అయిదు నగరాల్లోని ఎనిమిది స్టేడియాల్లో కలిపి మొత్తం 64 మ్యాచ్లు నిర్వహించారు.

తదుపరి (2026) టోర్నీని మెక్సికో, కెనడాలతో కలిసి అమెరికా నిర్వహించనుంది. ఈ మూడు దేశాల ప్రతినిధుల బృందం ఫైనల్ నంతరం ఖతార్ నిర్వాహకుల నుంచి డిసెంబర్ 18న ఆతిథ్య బాధ్యతలను స్వీకరించింది. 2026 జూన్-జులై నెలల్లో అమెరికా, మెక్సికో, కెనడాల్లోని 16 నగరాల్లో సాకర్ ప్రపంచ కప్ జరగనుంది.

  • ప్రపంచ కప్ ఫుట్బాల్ టైటిల్ సాధించడం అర్జెంటినాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది.
  • ప్రపంచకప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ (5 సార్లు) టాప్ ర్యాంక్ లో, జర్మనీ ( 4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్లో ఉన్నాయి.
  • 'షూటౌట్' ద్వారా ప్రపంచ కప్ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి.
  • అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచ కప్లో 'షూటౌట్'లలో మ్యాచ్లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది.
  • డిఫెండింగ్ చాంపియన్ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్ (1998లో) జట్టు ఫైనల్లో ఓడిపోయాయి.

ప్రైజ్ మనీ

  • విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 344 కోట్లు)
  • రన్నరప్: ఫ్రాన్స్ - 3 కోట్ల డాలర్లు (రూ.245 కోట్లు)

ప్రపంచ కప్ విశేషాలు

  • ప్రపంచ కప్లో నమోదైన మొత్తం గోల్స్ 172. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం. 1998, 2014 ప్రపంచ కప్లలో 171 గోల్స్ చొప్పున నమోదయ్యాయి. 
  • 16- టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు (ఫ్రాన్స్)
  • 8- ఒకే మ్యాచ్లో నమోదైన అత్యధిక గోల్స్ (ఇంగ్లండ్ 6, ఇరాన్ 2) 
  • 2- టోర్నీలో నమోదైన సెల్ఫ్ గోల్స్
  • 2- టోర్నీలో నమోదైన 'హ్యాట్రిక్'లు (ఎంబాపె, గొంకాలో రామోస్) 
  • ఓ ప్రపంచ కప్ గ్రూప్ దశ, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ గోల్ చేసిన తొలి ఆటగాడు మెస్సీ.
  • పీలే, బ్రెటినర్, వావా, జిదానె తర్వాత ఫ్రీఫా ప్రపంచ కప్లో ఒకటి కంటే ఎక్కువ ఫైనల్స్లో గోల్స్ చేసిన అయిదో ఆటగాడు ఎంబాపె. 2018లో క్రొయేషియాపై అతను ఓ గోల్ చేశాడు.
  • ఫీఫా ప్రపంచకప్ మెస్సీ గోల్స్ 13. అత్యధిక గోల్స్ జాబితాలో ఫాంటైన్తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు. మిరోస్లావ్ (జర్మనీ- 16), రొనాల్డో (బ్రెజిల్- 15), గెర్డ్ ముల్లర్ (జర్మనీ- 14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 
  • ప్రపంచ కప్ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్లు 26. అత్యధిక ప్రపంచ కప్ మ్యాచ్లడిన ఆటగాడిగా అతను.. జర్మనీ మాజీ ఆటగాడు లోధర్ (25)ను వెనక్కినెట్టాడు.  అందులో అత్యధిక విజయాల్లో (17)  మిరోస్లావ్ (జర్మనీ) సరసన చేరాడు.
  • ప్రపంచ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన రెండో ఆటగాడు ఎంబా షె. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జెఫ్ హస్ట్ (1966) అతని కంటే ముందున్నాడు. 
  • ఈ ప్రపంచ కప్లో ఎంబాపె గోల్స్ 8. 23 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో ఓ ప్రపంచ కప్లో ఇన్ని గోల్స్ చేసిన ఆటగాడు ఎంబాపై ఒక్కడే. జేమ్స్ రోడ్రిగ్స్ (2014), మారియో కెంపెస్ (1978), పీలే (1958) ఆరేసి గోల్స్ సాధించారు.

ముఖ్యమైన అంశాలు 

  • గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్): కైలియన్ ఎంబా (8 గోల్స్), ఫ్రాన్స్
  •  గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్): లియోనల్ మెస్సీ (7 గోల్స్) - అర్జెంటీనా
  • గోల్డెన్ గ్లెవ్ (బెస్ట్ గోల్కీపర్): మార్టినెజ్ (అర్జెంటీనా)
  • బెస్ట్ యంగ్ ప్లేయర్: ఎంజో ఫెర్నాండెజ్ ఫెయిర్ ప్లే అవార్డు: ఇంగ్లాండ్
  • పెయిర్ ప్లే అవార్డు : ఇంగ్లాండ్ 

స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి  

అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

1 comment:

  1. Why you posted this new this much early..

    ReplyDelete

Job Alerts and Study Materials