న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు NPCIL ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల కాబడింది. మొత్తం 325 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్స్ ట్రేడ్స్ లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మెకానికల్ విభాగం లో 123 ఖాళీలు ఉన్నాయి, మెకానికల్ విభాగం లో 123 ఖాళీలు ఉన్నాయి, కెమికల్ విభాగం లో 50 ఖాళీలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగం లో 57 ఖాళీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ విభాగం లో 25 ఖాళీలు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం లో 25 ఖాళీలు ఉన్నాయి, సివిల్ విభాగం లో 45 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు AICTE/UGC ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పైన పేర్కొన్న 6 ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లలో ఒకదానిలో కనీసం 60% మొత్తం మార్కులతో BE/B Tech/B Sc (ఇంజినీరింగ్)/5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ చేసి ఉండాలి. ఇంకా.. ఈ విద్యార్హతతో పాటు GATE-2021/GATE-2022/GATE-2023లో వ్యాలిడ్ స్కోర్ ను పొంది ఉండాలి.ఈ ఉద్యోగాలకు వయో పరిమితిగా 26 ఏళ్లను నిర్ణయించారు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. గేట్ 2021/2022/2023 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ రౌండ్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఉద్యోగ అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరియు నోటిఫికేషన్ పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
prameelamodolla@gmail.com
ReplyDeletegangaramramesh56@gmail.com
ReplyDeletegangaramramesh56@gmail.com
ReplyDelete