|
Telegram |
---|---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి | టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో(Airport) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 495 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 495 ఉద్యోగాల్లో మొత్తం 4 కేటగిరీల్లో నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో మొత్తం 80 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత సబ్జెక్డులో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,980 చెల్లించనున్నారు.
జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 64 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ లేదంటే సంబంధిత సబ్జెక్డులో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,640 చెల్లించనున్నారు.
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 121 పొస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,980 చెల్లించనున్నారు.
హ్యాండిమ్యాన్ విభాగంలో అత్యధికంగా 230 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,330 చెల్లించనున్నారు.
వీటితో పాటు.. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణ సాధించాలి. వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.23, 640 చెల్లించనున్నారు.
దరఖాస్తు రుసుము రూ.500 చెల్లించాలి. వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక HRD డిపార్ట్‌మెంట్ కార్యాలయం, AI యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై -600043. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 17 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
Rejaning
ReplyDelete